ENGLISH | TELUGU  

దర్శకనాయకులు 2016

on Dec 23, 2016

వరుస సూపర్‌ హిట్లు ఇస్తున్న డైరెక్టర్‌తో అంతే ఊపు మీదున్న హీరో జత కలిస్తే..మాస్ సినిమాలు చేసే హీరోతో..క్లాస్ డైరెక్టర్ సినిమా చేస్తే..స్టార్ డైరెక్టర్...ఒక చిన్న హీరోతో సినిమాతీసి సూపర్‌హిట్ కొడితే...ఫ్లాపుల్లో ఉన్న హీరో..ఫ్లాప్ డైరెక్టర్‌తో జోడీ కడితే ఇలాంటి క్రేజీ కాంభినేషన్స్ ఈ ఏడాది తెలుగు ప్రేక్షకుల్ని పలకరించి సక్సెస్ కొట్టాయి. సూపర్‌హిట్టు అవ్వడంతో పాటు ఈ సినిమాలన్నీ 50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం..వీటిలో ఈ ఏడాదిలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీ కూడా ఉంది. మరి ఆ సినిమాలేవో..ఆ దర్శకులతో జతకట్టిన హీరోలేవరో ఓ లుక్కేద్దాం.

సుకుమార్-ఎన్టీఆర్

.

టెంపర్‌తో మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్, వన్ సినిమాతో కష్టాల్లో ఉన్న సుకుమార్‌తో కలిసి చేసిన ప్రయోగం "నాన్నకు ప్రేమతో". సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీలో ..ఇప్పటి వరకు మాస్ లుక్‌లోనే కనిపించిన యంగ్‌టైగర్ లుక్, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతి విషయంలోనూ కొత్తదనం చూపించాడు. క్రియేటివ్ జీనియస్‌గా సుకుమార్ తన మార్క్ చూపించాడు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా కొత్తతరహా కథనంతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా ఎన్టీఆర్‌ స్టామినాను పెంచింది. 

బోయపాటి-అల్లుఅర్జున్

సినిమా సినిమాకు కొత్తగా కనపడాలని కోరుకుంటారు అల్లుఅర్జున్. అందుకే తగ్గట్టుగా తనను తాను మేకోవర్ చేసుకుంటారు బన్నీ . అందుకే అభిమానులు ఆయన్ను "స్టైలిష్‌స్టార్‌" అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. క్లాస్ వర్గాల్లో అల్లుఅర్జున్‌కు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.  మాస్ విషయానికి వచ్చేసరికి కాస్త డల్ అయిపోతాడు స్టైలిష్‌స్టార్..దీనిపై దృష్టిపెట్టిన అల్లువారబ్బాయి..ఊరమాస్ డైరెక్టర్‌గా పేరున్న బోయపాటితో సినిమా చేశాడు అదే "సరైనోడు". వేసవి కానుకగా వచ్చిన ఈ సినిమాలో అన్ని రకాల మాస్ ఎలిమెంట్స్ ఉండటంతో కలెక్షన్ల కుంభవృష్టి కురిసి అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది.


వంశీ పైడిపల్లి-నాగార్జున

తెలుగు సినిమా ఎప్పుడూ కొత్తగా ఉండాలని పరితపించే వారిలో కింగ్ నాగార్జున ముందు వరుసలో ఉంటారు. కెరీర్ ప్రారంభం నుంచి కొత్త వారికి, ప్రతిభ ఉన్న వారికి అవకాశాలిస్తూ, ప్రయోగాలే నా ఫస్ట్ ఛాయిస్ అని నిరూపించి చరిత్ర సృష్టించారు నాగ్. "మనం", "సొగ్గాడే చిన్నినాయన" లాంటి సినిమాల తర్వాత నాగ్ చేసిన ప్రయోగం "ఊపిరి". సూపర్‌స్టార్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సినిమా మొత్తం వీల్‌చైర్‌లోనే ఉండే పాత్ర చేయాలంటే ఎన్ని గట్స్ కావాలి. కానీ నాగ్ ఇవేవీ ఆలోచించలేదు.. వంశీ పైడిపల్లి మీద నమ్మకం ఉంచి అడుగు ముందుకేశాడు. కింగ్ తన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఊపిరిని ఒక దృశ్య కావ్యంలా మలిచాడు వంశీ. ప్రేక్షకులు కూడా ఊపిరిని బాగా ఆదరించారు.

త్రివిక్రమ్- నితిన్

త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి స్టార్ డైరెక్టర్ నితిన్ లాంటి యంగ్‌ హీరోతో జతకట్టిన మూవీ "అ..ఆ". కాంభినేషనే అనుకుంటూ టైటిల్‌ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేసింది. క్యూట్ లవ్‌స్టోరీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అ..ఆ ఆడియన్స్‌ని విపరీతంగా అలరించింది. 

కొరటాల-ఎన్టీఆర్

ఈ ఏడాది భారీ అంచనాలున్న కాంభినేషన్‌తో పాటు..ఆ అంచనాలను అందుకున్న జోడీ కొరటాల శివ-ఎన్టీఆర్. ఈ క్రేజీ కాంభినేషన్‌లో వచ్చిన మూవీ "జనతా గ్యారేజ్" వరుస సూపర్‌హిట్లతో అటు కొరటాల..ఇటు ఎన్టీఆర్ మంచి ఊపుమీద ఉండటంతో ఈ జోడీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినప్పటికి తర్వాత పుంజుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది గ్యారేజ్. అతి తక్కువ సమయంలోనే 50 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు సృష్టించింది. నాన్-బాహుబలి రికార్డులని, కొన్ని చోట్ల బాహుబలి రికార్డులని కూడా గ్యారేజ్ బ్రేక్ చేసింది. ఈ క్రమంలో 2016లో హయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది

సురేందర్ రెడ్డి- రామ్ చరణ్

బ్రూస్‌ లీ సినిమాతో మెగా అభిమానులను నిరాశపరిచిన మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్..కిక్-2తో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్న డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంభినేషన్‌లో వచ్చిన మూవీ "ధృవ". ఈ క్రేజీ కాంభినేషన్‌కు తోడు తమిళ సూపర్‌హిట్ "తనీఒరువన్‌"ను తెలుగులోకి రీమేక్‌‌‌ చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించడంతో సురేందర్ రెడ్డి-చెర్రీలు దానిని ఎలా హ్యాండిల్ చేశారా..? అని ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూడసాగారు. అందుకు తగ్గట్టుగానే లుక్, బాడీ లాంగ్వేజ్‌ను కూడా టోటల్‌గా మార్చేశాడు చరణ్. మెగాపవర్‌ స్టార్ యాక్టింగ్‌కు తోడు సురేందర్ రెడ్డి స్టైలిష్ టేకింగ్ సినిమాను సక్సెస్ చేసింది. ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ వసూళ్లను రాబడుతోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.