ఉప 'ధృవ'మేనా..?
on Dec 22, 2016
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ తేజ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన "ధృవ" కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు బాగానే వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2000కు పైగా థియేటర్లు, ముఖ్యంగా యూఎస్‌లో ఎన్నడూ లేని విధంగా 200 స్క్రీన్లలో విడుదలవ్వడం ధృవకు ప్లస్‌గా మారింది. ఊహించినట్లుగానే పది రోజుల్లో 64.4 కోట్ల గ్రాస్ వసూలు చేసి చెర్రీ దుమ్ములేపాడు. అయితే సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మాత్రం ఇంకా లాభాలు రానట్లే. ఎందుకంటే 60 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ధృవకు కనీసం 90 కోట్ల కలెక్షన్లు వస్తేనే పెట్టుబడి పెట్టిన వారు గట్టెక్కుతారు.
తొలివారం వసూళ్ల పంట పండించుకున్నప్పటికీ ఆ తర్వాత విడుదలైన చిన్న సినిమాలు ధృవపై కాస్త ప్రభావాన్ని చూపాయి..దీనికి తోడు ఫుల్ లెంగ్త్ క్లాస్ టచ్ ఉన్న సినిమా కావడంతో మాస్ జనాలకు అంతగా ఎక్కలేదు..సీడెడ్ లాంటి మాస్ ఏరియాల్లో వస్తున్న కలెక్షన్లే దీనికి ఉదాహరణ. ఇదిలా ఉంటే రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన "వంగవీటి", అమీర్‌ఖాన్ "దంగల్" ఈ వారమే రిలీజవుతుండటంతో దెబ్బ భారీగానే పడవచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఉపద్రవాన్ని రామ్‌చరణ్ ఎలా తప్పించుకుంటానేది వేచి చూడాలి.