ENGLISH | TELUGU  

27 ఏళ్ల వెన్నెల

on Dec 21, 2016

హీరోయిన్‌గా వెండితెరపై వెలిగిపోవాలంటే వరుస బ్లాక్ బస్టర్లు ఆమె ఖాతాలో ఉండాలి..కానీ కెరీర్‌‌‌లో ఒకటి రెండు సూపర్‌హిట్లు మినహా లేకపోయినా ఆవిడే నంబర్ వన్. అంతేనా ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌ కూడా ఈ బ్యూటీనే..ప్రజంట్ హీరోలతో సమానంగా స్టెప్పులు వేయాలన్నా ఆమె..భవిష్యత్తు ఎంటో తెలుసుకుని వ్యాపారవేత్తగా మారినా ఆమెకే చెల్లింది. ఆ హీరోయిన్ ఎవరో మీకు ఈపాటికే అర్థమైపోవాలి. ఆమె ఎవరో కాదు..మిల్కీ బ్యూటీ "తమన్నా". 15 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి..అగ్రతారగా పుష్కరకాలం పూర్తి చేసుకుంది తమన్నా. ఒక్కో మెట్టు ఎక్కుతూ..వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ..దూసుకుపోవడం తమన్నాకే సాధ్యమైంది. ఇవాళ ఆ పాలరాతి శిల్పం పుట్టినరోజు..ఈ సందర్భంగా తమన్నాకు శుభాకాంక్షలు తెలుపుతూ..ఆమె గురించి మరిన్ని విషయాలు మీకోసం. 


15 ఏళ్ల వయసులో ఫస్ట్ మూవీ:

 

15 ఏళ్ల వయసులో షాబా షాంసీ దర్శకత్వంలో వచ్చిన  'చాంద్ సా రోషన్ చెహరా' అనే హిందీ చిత్రం ద్వారా తమన్నా తొలిసారి ముఖానికి రంగేసుకున్నారు. దీనిలో సమీర్ అఫ్తాబ్‌‌కు జంటగా నటించారు తమన్నా.

 

తొలి తెలుగు సినిమా "శ్రీ" :

 

దశరథ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ తమన్నా తొలిసారి తెలుగువారిని పలకరించారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌కి జంటగా నటించారు.

 

తొలి తమిళ సినిమా "కేడీ" :

 


తెలుగులో అంతగా అవకాశాలు రాకపోవడంతో తమన్నా చూపు కోలీవుడ్‌పై పడింది. ఈ క్రమంలో జ్యోతికృష్ణ దర్శకత్వంలో వచ్చిన కేడీ సినిమా ద్వారా తమిళ చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో రవికృష్ణ, ఇలియానాలతో తెరను పంచుకున్నారు తమన్నా.

 

13 ఏళ్లకే మోడల్:

 


అందరు హీరోయిన్లకి స్టార్‌ స్టేటస్ వచ్చిన తర్వాత బ్రాండ్ ఎండార్సింగ్ ఛాన్సులు వస్తాయి..కానీ తమన్నాకి మాత్రం సినిమాల్లోకి రాకముందే ఆ అవకాశం వచ్చింది. ఓ సారి పాఠశాల వార్షికోత్సవంలో తమన్నాను చూసిన ఓ దర్శకుడు నటిస్తావా అని అడిగారు. అలా 13 ఏళ్ల వయసులోనే ప్రఖ్యాత ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో కనిపించారు తమన్నా.


హీరోయిన్‌గా తొలి ఎండార్స్‌మెంట్ :

 

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తమన్నా చేత ఎండార్స్‌మెంట్ చేయించుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు క్యూకట్టాయి..అలా సెల్‌కాన్ మొబైల్స్‌కి తొలిసారి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు తమన్నా.

 

ఫస్ట్ గెస్ట్ రోల్:

 

శ్రీనువైట్ల దర్శకత్వంలో రామ్, జెనీలియా నటించిన రెడీ సినిమాలో తమన్నా తళుక్కున మెరిశారు. రామ్ మరదలిగా తమన్నా గెస్ట్‌రోల్ చేశారు.

 

ఫస్ట్ ఐటెంసాంగ్:

 

హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉన్నప్పుడు ఐటెంసాంగ్‌లో నటించి ఇండస్ట్రీని షాక్‌కు గురిచేశారు తమన్నా. వివి.వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడుశ్రీను సినిమాలో తమన్నా ఐటెంసాంగ్‌లో డ్యాన్స్ చేసి తోటి హీరోయిన్లను ఈ దిశగా ఆలోచించేలా చేశారు.

 

బిజినెస్ వుమెన్‌గా:

 

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు మిల్కీబ్యూటీ తమన్నా వ్యాపారంలోకి సైతం అడుగుపెట్టింది. తండ్రితో కలిసి వజ్రాల వ్యాపారం ప్రారంభించింది..ఇందుకోసం వైట్ అండ్ గోల్డ్ అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.


దేశానికి సేవ:

 

తనను ఇంతస్థాయికి తీసుకువచ్చిన దేశానికి కొంతైనా సాయం చేయాలని తమన్నా నిర్ణయించుకుంది..ఇందులో భాగంగా కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బేటీ బచావో..బేటీ పడావో కార్యక్రమానికి అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.