ధృవ ఫస్టాఫ్ రివ్యూ
on Dec 8, 2016
మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రామ్చరణ్ ధృవ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజయ్యింది. తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇప్పటికే మార్నింగ్ షో పడిపోయింది. కొద్దిసేపటి క్రితం ఫస్టాఫ్ పూర్తవ్వడంతో రిలాక్స్ అయ్యేందుకు బయటకు వచ్చిన జనం ట్విట్టర్, వాట్సాప్ ద్వారా సన్నిహితులతో సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. రామ్ చరణ్ యాక్టింగ్ అదిరిపోయిందని..ఎక్కడా బోర్ కొట్టకుండా అప్పుడే ఇంటర్వెల్ వచ్చిందా అనిపించేంతగా ఉందని కొందరు ట్వీట్ చేశారు. స్క్రీన్ప్లే రేసీగా ఉందని, పాటల పిక్చరైజేషన్ చాలా బాగుందని కొందరు తెలిపారు. సెకండాఫ్ కూడా ఇలాగే ఉంటే సినిమాకు ఢోకా లేదని అంటున్నారు. ఫుల్ లెంగ్త్ రివ్యూ కోసం చూస్తూనే ఉండండి తెలుగువన్.కామ్