రాజకీయాల్లోకి నయనతార
on Aug 31, 2016
నయనతార త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెడుతోందా, సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పి సమాజ సేవలో తరించబోతోందా? అవుననే అంటున్నాయి చెన్నై వర్గాలు. నయరతార దృష్టి ఇప్పుడు రాజకీయాలపై పడిందని టాక్. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌కి నయన హాజరైంది. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఓ అధికారిక కార్యక్రమం. సినిమా వేడుకల్లో ఎప్పుడూ కనిపించని నయనతార ఓ పొలిటికల్ ఈవెంట్లో మెరిసేసరికి అంతా ఆశ్చర్యపోయారు. ఇటీవల జయలలిత అనుచరులు కొంతమంది నయనతారని కలసి సుదీర్ఘంగా భేటీ వేసినట్టు టాక్. నయనతార కూడా సినిమాల్ని వదిలేసి కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టాలని ఆశపడుతోందట. రాజకీయాల్లోకి రావడానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది. తమిళనాట సినీ నటులు రాజకీయాల్లోకి చేరి చక్రం తిప్పారు. కథానాయికల రాజకీయ ప్రస్తానం భేషుగ్గానే ఉంది. హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన వాళ్లు రాజకీయాల్లో చేరి అక్కడా రాణిస్తున్నారు. ఆ సెంటిమెంట్‌తోనే నయన ఈ నిర్ణయం తీసుకొన్నట్టు టాక్. ఎలాగూ సినిమాల్లో అవకాశాలు తగ్గిపోతున్నాయి.సో.. పోలిటిక్స్ వైపు పయనించడానికి రెడీ అయ్యిందన్నమాట.