ప్రభాస్ ప్రస్తుతానికి సేఫ్ గానే వున్నాడు..!
on Jul 20, 2016
"మిర్చి" సినిమాలో "నా ఫ్యామిలీ సేఫ్" అంటూ ప్రభాస్ ఎంతో పవర్ ఫుల్ గా చెప్పిన డైలాగ్ ను ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు సినిమా చూసినవాళ్ళెవరూ మర్చిపోలేరు. అలాగే.. ఇప్పుడు "మా ప్రభాస్ రికార్డ్స్ సేఫ్" అంటూ ఇంచుమించుగా అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు ప్రభాస్ అభిమానులు. "సుల్తాన్" సినిమా విడుదలైనప్పుడు ఎక్కడ సల్మాన్ ఖాన్ ఆ సినిమాతో ప్రభాస్ "బాహుబలి" ఫస్ట్ డే రికార్డ్ ను బ్రేక్ చేసేస్తాడేమో అనుకొన్నారందరూ. కట్ చేస్తే.. "సుల్తాన్" విడుదలైంది బుధవారం అందునా ఈద్ రోజు కావడంతో అందరూ పండగ హడావుడ్లో ఎక్కువమంది జనాలు థియేటర్లకు రాలేదు. దాంతో "బాహుబలి" ఫస్ట్ డే కలెక్షన్స్ 42.3 కోట్లు కాగా.. "సుల్తాన్" 37.2 కోట్లతో సరిపెట్టుకొంది. దాంతో ప్రభాస్ అభిమానులు ఊపిరి పీల్చుకొన్నారు!