బాహుబలిని కొట్టేసిన సుల్తాన్..
on Jul 15, 2016
కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ ప్రభంజనం సృష్టిస్తున్నాడు. హౌస్ ఫుల్ షోలతో పాటు కలెక్షన్ల కుంభవృష్టిని కురిపిస్తూ రికార్డులన్ని తిరగరాస్తున్నాడు. ఈ దారిలో బాహుబలి రికార్డులకు ఎసరు పెట్టాడు.. రికార్డులు ఉన్నది బద్ధలు కొట్టడానికే అన్నట్టు ఇండియన్ బ్లాక్ బస్టర్‌గా పేరు తెచ్చుకున్న బాహుబలి రికార్డును సుల్తాన్ బద్దలు కొట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా భారీగా రిలీజ్ అయిన బాహుబలి సినిమా తొలి వారంలో 185 కోట్ల వసూళ్లను సాధించింది. సల్మాన్ హీరోగా తెరకెక్కిన సుల్తాన్ తొలివారంలోనే 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఇప్పటి వరకు తొలి వారం కలెక్షన్ల విషయంలో ఫస్ట్‌ప్లేస్‌లో ఉన్న బాహుబలి సుల్తాన్ దెబ్బకి రెండోస్థానానికి పడిపోయాడు. సుల్తాన్ హవా మరింతకాలం కొనసాగే అవకాశం ఉండటంతో మరెన్ని రికార్డులు బద్ధలు కానున్నాయో..