సెల్ఫీలో అల్లరి నరేష్ మిస్సింగ్!
on Jul 14, 2016
అసలు "సెల్ఫీ రాజా" సినిమాలో హీరోనే అల్లరి నరేష్ కదా.. అలాంటిది సెల్ఫీలో అల్లరి నరేష్ మిస్సవడం ఏంటీ? అనుకొంటున్నారా. అయితే.. అది సినిమాలో కాదులెండి.. రేపు సినిమా విడుదల సందర్భంగా "సెల్ఫీ రాజా" హీరోయిన్స్ సాక్షి చౌదరి, కామ్నాలు రేడియో మిర్చి ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ప్రమోషన్స్ లో భాగంగా మీడియాకి ఫోటో ఫోజులిస్తున్న తరుణంలో ఓ సెల్ఫీ కూడా తీసుకొన్నారు. సినిమా కాన్సెప్ట్ "సెల్ఫీ" కావడంతో ఆ సెల్ఫీలో హీరో కూడా ఉంటే బాగుండేదని అక్కడున్నవారందరూ అభిప్రాయపడ్డారట.ఇకపోతే.. వరుస పరాజయాల అనంతరం అల్లరి నరేష్ నటించగా విడుదలవుతున్న "సెల్ఫీ రాజా"పై నరేష్ బోలెడు ఆశలుపెట్టుకొన్నాడు. ఈ సినిమా సక్సెస్ అవ్వకపోతే.. అల్లరోడి ఆశాలన్నీ ఆవిరైనట్లే!