మెగా ఫ్యాన్స్ కు డబుల్ డోస్!
on Jul 11, 2016
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22 అంటే మెగా అభిమానులకు పండగ రోజుతో సమానం. ఆ పండగ వాతావరణాన్ని మరింత వేడెక్కించి.. అభిమానులకు నూతనోత్సాహాన్నిచ్చేందుకు చిరుతనయుడు చరణ్ సన్నద్ధమవుతున్నాడు. చిరు 61వ జన్మదినోత్సవం సందర్భంగా.. మెగా 150వ చిత్రం టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోపాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయాలనుకొంటున్నాడు చరణ్. ఈలోపు హీరోయిన్ ఎవరనే విషయంలోనూ క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి.. ఏకంగా కాంబినేషన్ స్టిల్స్ ను సైతం రిలీజ్ చేస్తాడు. ఇది కాకుండా.. చరణ్ నటిస్తున్న "ధృవ" చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ను కూడా అదే రోజుల విడుదల చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడు. సో, ఆగస్ట్ 22న మెగా అభిమానులకు ఓపిక ఉండాలే కానీ.. ఆరోజంతా పండగేనన్నమాట. సో, డియర్ మెగా ఫ్యాన్స్ గెట్ రెడీ ఫర్ ది మెగా డబుల్ డోస్!