రామ్ చరణ్ పిచ్చికి ఉపాసన చెక్!
on Jun 16, 2016
సెల్ ఫోన్, ట్విట్టర్, ఫేస్ బుక్ ఈ మూడిటికి ఎడిక్ట్ అవ్వకపోయినా.. ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇందుకు విరుద్ధం ఏమీకాడు కదా. అతగాడికి కూడా ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే ఎనలేని ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా సెల్ ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడపడట. ఈ విషయం ఆయన సతీమణి ఉపాసనకు మింగుడుపడలేదు. అందుకే చరణ్ సెల్ ఫోన్ పిచ్చికి చెక్ పెట్టాలని ఒక వైవిధ్యమైన పద్ధతి ఎన్నుకొంది.
ప్రతి ఏడాది ఓ వారం రోజులపాటు ఏదైనా మారుమూల ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసింది. ఆ వారం రోజులపాటు చరణ్ తన సెల్ ఫోన్ ను ముట్టుకోవడం మాత్రమే కాదు కన్నెత్తి కూడా చూడకూడదని రూల్ పెట్టింది. భార్య తనకు పెట్టిన ఆంక్షను కాదనలేకపోయాడట చరణ్. ఈ పద్ధతి తనలో మంచి మార్పును తీసుకువస్తుందని, ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కు అప్పుడప్పుడూ దూరంగా ఉండడం వలన మన ఉనికిని మనం గుర్తించగలం అని తాను నేర్చుకొన్న అంశాలను చెబుతున్నాడు చెర్రీ.
ఈ పద్ధతిని మనం కూడా ఒకరోజు ఫాలో అయ్యి చూద్దామా !?