నాని వచ్చేవరకూ అ ఆ ఒక్కటే ఆప్షన్..!
on Jun 11, 2016
పెద్దగా అంచనాలు లేకుండా రిలీజైన అ ఆ హిట్ నుంచి భారీ హిట్ దిశగా పరుగులు తీస్తోంది. అయితే ప్రతీ శుక్రవారం రిలీజయ్యే సినిమాలు, ముందు వారం రిలీజైన సినిమాల థియేట్రికల్ రన్ ను ప్రభావితం చేస్తాయి. అయితే అ ఆ మాత్రం ఈ ఎఫెక్ట్ నుంచి తప్పించుకోగలిగింది. ఈ వారం రిలీజైన ఒక్క అమ్మాయి తప్ప, రైట్ రైట్ సినిమాల్లో ఏది బాగున్నా, త్రివిక్రమ్ సినిమా కలెక్షన్స్ గ్యారంటీగా డౌన్ అయిపోయి ఉండేవి. కానీ రెండూ యావరేజ్ టాక్ తెచ్చుకోవడంతో, త్రివిక్రమ్ అండ్ కో మరో వారం పాటు ఎదురులేకుండా కలెక్షన్లు కుమ్మేసుకోవచ్చు. తర్వాతి వారం నాని జెంటిల్ మన్ వచ్చే వరకూ అ ఆ కు ఎలాంటి టెన్షన్ లేదు. జనానికి వేరే ఆప్షన్ లేదు. నెక్స్ట్ వారం జంటిల్ మన్ రిజల్ట్ బట్టి, అ ఆ టోటల్ రన్ మీద ఒక అంచనాకు వచ్చేయచ్చు. ఏదేమైనా, ముందునుంచీ ఏమాత్రం అంచనాలు క్రియేట్ చేయకుండా, చాలా తెలివిగా హిట్ కొట్టాడు మాటల మాంత్రికుడు.