మెగాభిమానులకు కొత్త రకం టెన్షన్..!
on Jun 8, 2016
మెగాభిమానులకు, ముఖ్యంగా చరణ్ అభిమానులకు ఇప్పుడో కొత్త టెన్షన్ పట్టుకుంది. ఈమధ్యే షూటింగ్ స్టార్ట్ చేసిన ధృవ గురించే వారి బాధ అంతా. సినీ ఫీల్డ్ లో ఉన్న సెంటిమెంట్స్, మరే రంగంలోనూ ఉండవన్న విషయం తెలిసిందే. ఈ సెంటిమెంట్స్ ధృవ విషయంలో వర్కవుట్ అవ్వకూడదని ప్రార్థిస్తున్నారు మెగాఫ్యాన్స్. వారి బాధకు కారణం ఉంది. చరణ్ ఇంతకుముందు పోలీస్ క్యారెక్టర్ వేసిన సినిమా జంజీర్. ఇది అతని కెరీర్లోనే మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలిపోయింది. తన తాజా సినిమాలో కూడా చెర్రీ పోలీస్ డ్రస్సే వేస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ డేట్ ను దసరా సీజన్ కు ఫిక్స్ చేసేయడం ఆల్ మోస్ట్ కన్ఫామ్ గా కనిపిస్తోంది. గతేడాది ఇదే టైం లో బ్రూస్ లీ వచ్చి చరణ్ కు దెబ్బ కొట్టింది. అంతకు ముందు ఏడాది సీజన్లో గోవిందుడు అందరి వాడేలే ఈ సీజన్లో రిలీజైంది. ఆ సినిమా కూడా యావరేజ్ గా ఆడి వెళ్లిపోయింది. దీని బట్టి సెంటిమెంటల్ గా సెప్టెంబర్ అక్టోబర్ సీజన్ చరణ్ కు వర్కవుట్ అవట్లేదు అని భయపడుతున్నారు చెర్రీ ఫ్యాన్స్. ఈసారి మాత్రం ఎలాంటి సెంటిమెంట్స్ వర్కవుట్ అవ్వకూడదని కోరుకుంటున్నారు. వారి భయాల్ని, ఇండస్ట్రీ సెంటిమెంట్స్ ను ధృవ మారుస్తుందో లేదో చూడాలి మరి..