ఆ డైరెక్టర్ తో కాజల్ కు మళ్లీ మొదలైన టార్చర్..!
on May 16, 2016
తెలుగు ఇండస్ట్రీలో టాలెంట్ తో ఒక వెలుగు వెలిగి తర్వాత స్లో అయిపోయిన వాళ్లలో దర్శకుడు తేజ పేరు తప్పకుండా ఉంటుంది. చిత్రం, నువ్వునేను, జయం లాంటి సినిమాలతో వరస హిట్లతో ఇండస్ట్రీని ఊపేసిన తేజ ఆ తర్వాత హిట్ కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హిట్ కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, సరైన ఫ్లాట్ ఫామ్ మాత్రం తేజకు దొరకలేదు. ఎట్టకేలకు లక్ కలిసొచ్చి, రానా, కాజల్ లాంటి స్టార్స్ తో సినిమా పడింది. అయితే షూటింగ్ టైం లో మాత్రం తేజలోని పెర్ఫెక్షనిజం బయటికొచ్చేసింది. గతంలో షాట్ బాగా రావడం కోసం హీరోయిన్లపై ఆయన చేయి చేసుకున్నాడనే వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. సీన్ పండటం కోసం ఎంత వరకూ అయినా వెళ్లే తేజ, ఇప్పుడు చందమామ కాజల్ ను టార్చర్ చేస్తున్నాడట. మ్యాన్ హాండ్లింగ్ చేయట్లేదులే కానీ, ఆమె ఒళ్లు తగ్గాలని, ఇంకా సన్నబడాలని పదే పదే ఒత్తిడి తెస్తున్నాడట. తనతో తెలుగు ఇండస్ట్రీలో తొలి అడుగు వేయించిన తేజ మాట కాదనలేని కాజల్ ప్రస్తుతం అదే పనిలో ఉందట. సినిమాలో రానా భార్యగా కాజల్ చేస్తోందని, రాజకీయ కోణంలో సినిమా ఉండబోతుందని సమాచారం.