అక్కడ అట్టర్ ఫ్లాపైన బాహుబలి..!
on May 7, 2016
బాహుబలి..ఈ పేరు ఒక సంచలనం. తెలుగు వారికే కాక భారతీయులందరూ గర్వించదగ్గ సినిమాగా పేరు సంపాదించిన బాహుబలి విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల సునామీ సృష్టించింది. సౌత్ మూవీస్ ఇప్పటి వరకూ సాధించలేని ఘనతలెన్నో ఈ సినిమా సొంతం చేసుకుంది. కేవలం ఇండియా మాత్రమే కాక, మిగిలిన దేశాల్లో కూడా డబ్ అయి సక్సెస్ అయిన బాహుబలికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్ 28న బాహుబలిని జర్మనీ భాషలో డబ్ చేసిన 30 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. సినిమా అన్ని దేశాల్లో ఆడినట్టే అక్కడ కూడా కుమ్మేస్తుందని భావించిన అక్కడి డిస్ట్రిబ్యూటర్లకు షాక్ తగిలింది. అన్ని హాల్స్ లో కలిపి కేవలం 4166 యూరోలు (3.17 లక్షలు) మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఎక్కడ రిలీజైనా ఎదురులేకుండా జైత్రయాత్రను సాగించిన బాహుబలి, జర్మనీని వశపరుచుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు చైనా దేశం ఈ వీరుడికి చివరి మజిలీ. జూన్ లో చైనాపై కూడా బాహుబలి తన దండయాత్ర చేయబోతున్నాడు. వాళ్లకు ఇలాంటి సినిమాలు కొత్త కాదు. కొనేళ్ల క్రితం ఇదే టైప్ లో రెడ్ క్లిఫ్ అనే సినిమా రెండు పార్ట్స్ గా అక్కడ రిలీజై ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని నమోదుచేసుకున్నాయి. ఆ నమ్మకంతోనే బాహుబలి కూడా చైనాలో ఎంటరవుతోంది. మరి అక్కడి ప్రజలు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.