బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో చెప్పిన రాజమౌళి..!
on Apr 3, 2016
బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు..? బాహుబలి రిలీజైనప్పటి నుంచీ చాలా మంది మదిలో ఉన్న క్వశ్చన్ ఇది. మొత్తం ఇండియా ఈ ప్రశ్నతో వెర్రెత్తిపోయింది. కానీ తాజాగా కట్టప్ప ఎందుకు చంపాడో రాజమౌళి చెప్పేశాడు. కానీ ఆ ఆన్సర్ వింటే మీరు డెఫినిట్ గా రాజమౌళిని తిట్టుకుంటారు. తాను చంపమన్నాను కాబట్టి, కట్టప్ప బాహుబలిని చంపాడు అని చెప్పాడు జక్కన్న. అసలు ఆన్సర్ నిజంగానే చెబుతాడని వెయిట్ చేసిన ఎంతో మందికి నిరాశే ఎదురైంది. గతేడాది రిలీజై అతి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది బాహుబలి. జాతీయ ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చేంతగా ఈ సినిమా ప్రభావం చూపించింది. యావత్ దేశాన్ని ఉర్రూతలూగించింది. ఈ సినిమాకు ప్రభాస్ కు 20 కోట్లు, రాజమౌళికి 26 కోట్లు తమ రెమ్యునరేషన్ గా లభించాయని సమాచారం. సినిమాలో గ్రాఫిక్స్ ను సెకండ్ పార్ట్ లో మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు జక్కన్న. మొదటి పార్ట్ లో ఉన్న గ్రాఫిక్స్ కంటే మరింత రియలిస్టిక్ గా సీన్స్ కనబడేలా ప్లాన్ చేస్తున్నారట. కట్టప్ప ప్రశ్నకు జవాబు కావాలంటే మాత్రం, వచ్చే ఏడాది బాహుబలి 2 రిలీజ్ వరకూ వేచి చూడాల్సిందే మరి.