విశాల్ పెళ్లికి డేట్ ఫిక్సైంది!!
on May 11, 2019
హీరో విశాల్ , ప్రముఖ వ్యాపారి డాటర్ అనీషా రెడ్డి గత కొంతకాలంగా లవ్ చేసుకుంటున్నారు. అయితే వీరి ప్రేమని అంగీకరించిన ఇరు కుటుంబాల పెద్దలు ఇటీవల గ్రాండ్ గా నిశ్చితార్థం జరిపిన విషయం తెలిసిందే. అయితే త్వరలో వీరి పెళ్లికి బాజాలు మోగనున్నాయని తెలుస్తోంది. అవును వీరి పెళ్లికి అక్టోబర్ 9న డేట్ ఫిక్స్ చేసారట. వీరి పెళ్లికి పెద్ద సంఖ్యలో సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించనున్నారట. అయితే విశాల్ ముందు చెప్పిన్టు నడిఘర్ సంఘం భవనంలో వీరి పెళ్లి జరగనుందా? లేక హైదరాబాద్ లో జరుగుతుందా? అనేది త్వరలో తెలిసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.