English | Telugu

తమన్నాను ఎందుకు తిడతారంటే?

on Jan 8, 2019

తమన్నా ఎప్పుడు ఏ సినిమాలో నటించినా... ఆ సినిమా యూనిట్ సభ్యులు ఆమెను తిడతారట! ఎందుకో తెలుసా? తమతో టైమ్ స్పెండ్ చేయడం లేదని! 'ఎఫ్2' ప్రెస్‌మీట్‌లో తమన్నాయే ఈ విషయం చెప్పారు. "మామూలుగా నేను షూటింగ్ చేసేటప్పుడు.. నా వర్క్ ఫినిష్ అయ్యాక నేను రూమ్‌కి వెళిపోతా. కో స్టార్స్ లేదా కొలీగ్స్‌తో నేను టైమ్ స్పెండ్ చేయను. చాలాసార్లు ఈ విషయమై సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ నన్ను తిడతారు. 'సెట్‌కి వ‌స్తావు కానీ.. మాతో మాట్లాడ‌వు' అని అంటుంటారు" అని తమన్నా అన్నారు. 'ఎఫ్ 2' సెట్‌లో మాత్రం అటువంటి తిట్లు ఏవీ లేవట. ఎందుకు? అంటే... తన షూటింగ్, వర్క్ అయ్యాక మిగతా ఆర్టిస్టులతో మాట్లాడాలని తమన్నా సెట్‌లో వుండేవారట. ఎంతో సరదాగా సినిమా షూటింగ్ జరిగిందని ఆమె అన్నారు. 'ఎఫ్ 2'లో వెంకటేష్ జోడీగా నటించారీమె. వెంకీ ఎంతోమందికి ఇన్స్‌పిరేష‌న్‌ అని చెప్పిన తమన్నా... "ఆయన ఎన్నో సినిమాలు చేశారు. ఎన్నో పాత్రల్లో నటించారు. అయినా... వెండితెరపై ఇంత ఫ్రెష్‌గా, ఇంత ముద్దుగా ఆయన ఎలా కనిపిస్తారో నాకు తెలియాలి!" అని అన్నారు. తమన్నా మాటలకు వెంకటేష్ ముందు ఓ వింత ఎక్స్‌ప్రెష‌న్ ఇచ్చినా తరవాత ముసిముసి నవ్వుల్లో మునిగారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here