తమన్నా... నెక్స్ట్ ఏంటి?
on Nov 8, 2018
సందీప్ కిషన్, తమన్నా జంటగా అప్పుడెప్పుడో ఒక సినిమా ప్రారంభమైంది. హిందీలో 'ఫనా' సినిమాకు దర్శకత్వం వహించిన కునాల్ కోహ్లీ ఈ సినిమాకు దర్శకుడు. సుమారు ఏడాదిన్నర క్రితమే సినిమా స్టార్ట్ అయ్యింది. లండన్‌తో పాటు కొన్ని నగరాల్లో షూటింగ్ చేశారు. ఆ తరవాత సినిమా గురించి ఉలుకు పలుకు లేదు. వున్నట్టుండి దీపావళి సందర్భంగా సినిమాటైటిల్ ప్రకటించారు. దాంతో పాటు సినిమాలో నవదీప్ కూడా చేస్తున్నాడని తెలిపారు. తమన్నా, సందీప్ కిషన్, నవదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు 'నెక్స్ట్ ఏంటి?' టైటిల్ ఖరారు చేశారు. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తారట. సందీప్ కిషన్, నవదీప్ హీరోలు అయినప్పటికీ... ప్రేక్షకుల్లో తమన్నా ఫాలోయింగ్, ఆమె యాక్టింగ్ మీద సినిమా దర్శకుడు, నిర్మాతలు నమ్మకం పెట్టుకున్నారు. వాళ్ళతో పాటు హీరోలు ఇద్దరికీ సినిమా బ్రేక్ ఇస్తుందేమో చూడాలి!