English | Telugu

తమన్నా వెయిటింగ్!

on Dec 3, 2018

మెగాస్టార్ చిరంజీవితో నటించబోయే 'సైరా నరసింహారెడ్డి' సినిమా తన కెరీర్‌లో చాలా ఇంపార్టెంట్ సినిమా అంటోంది తమన్నా. మెగా ప‌వ‌ర్‌స్టార్‌ రామ్‌చ‌ర‌ణ్‌తో 'రచ్చ'లో తమన్నా సందడి చేసింది. అందులో చిరంజీవి పాట 'వానా వాన వెల్లువాయే'ను రీమిక్స్ చేశారు. ఆ పాటకు తమన్నా వేసిన స్టెప్పులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మెగాస్టార్ కూడా ఆమెను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇప్పుడు ఆయన పక్కనే ఆమె నటించబోతోంది. చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చ‌ర‌ణ్‌ నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో నయనతార, తమన్నా కథానాయికలు. ఇప్పటికే నయనతారపై కొన్ని సన్నివేశాలు తీశారు. రాజసం ఉట్టిపడే ఆహార్యంలో ఆమె స్టిల్స్ విడుదల చేశారు. మరి, తమన్నా సంగతి ఏంటి? అంటే... ఇంకా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాలేదు. "నా కెరీర్‌లో 'సైరా' చాలా ఇంపార్టెంట్ సినిమా. చిరంజీవిగారితో పని చేయబోతున్నందుకు సంతోషంగా వుంది. నా పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ఎప్పుడు చిత్రీకరిస్తారా? చిరంజీవిగారితో ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా? అని ఎదురుచూస్తున్నా" అని తమన్నా అన్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here