బన్నీ సెట్లో టబు సందడి!!
on Jul 24, 2019
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలసిందే. ప్రజంట్ ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు చాలా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంలో టబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇక చాల గ్యాప్ తర్వాత తెలుగులో రీ ఎంట్రీ ఇస్తోన్న టబు బన్నీ సెట్ లో ఈ రోజు అడుగుపెట్టింది. ఈ సినిమాలో టబు లుక్ తో పాటు లుక్ కి సంబంధించిన ఓ వీడియోను ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ వీడియో లో టబు చాలా ఇంట్రస్టింగ్ గా సీన్ పేపర్ చదువుతూ ఉంది. పక్కనే వీడియోలో మురళి శర్మ కూడా సీన్ పేపర్ చుదువుతూ ఉన్నారు. దీన్ని బట్టి వీరిద్దరి కలయికలో సన్నివేశం పిక్చరైజ్ చేయబోతున్నట్లు అర్థమవుతోంది. ఇక షాట్ లోకి వెళూతూ తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పడంతో వీడియో పూర్తైంది. `ఏఏ 19` రూపొందుతోన్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిన సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
Also Read