'సైరా'లో రామ్ చరణ్ ఎందుకు నటించలేదు?
on Aug 24, 2019
'మగధీర'లో రామ్ చరణ్ తో కలిసి మెగాస్టార్ చిరంజీవి ఓ పాటలో కనిపించారు. తండ్రీకొడుకులను ఒక ఫ్రేములో చూసుకుని మెగాభిమానులు మురిసిపోయారు. తర్వాత మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన 'ఖైదీ నంబర్ 150'లో రామ్ చరణ్ ఒక పాటలో కనిపించారు. ఇద్దరు కలిసి సేమ్ స్టెప్ వేస్తే ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. 'ఖైదీ నంబర్ 150' తర్వాత మెగాస్టార్ నటించిన సినిమా 'సైరా నరసింహారెడ్డి'. ఇందులో రామ్ చరణ్ నటిస్తే బావుండేదని అభిమానుల కోరిక. ఏదో ఒక చిన్న పాత్రలో అతిథిలా కనిపిస్తాడని ఆశతో ఉన్నారు. కానీ, సినిమాలో తాను నటించలేదని రామ్ చరణ్ స్పష్టం చేశారు. అయితే... ఒకానొక సమయంలో 'సైరా'లో రామ్ చరణ్ కోసం చిరంజీవి, దర్శకుడు సురేందర్ రెడ్డి ఒక పాత్ర అనుకున్నారట. ఇంటర్వెల్ కి ముందు వచ్చే ఫైట్ లో షేర్ ఖాన్ పాత్రను రామ్ చరణ్ తో చేయించాలని భావించారట. కానీ, స్క్రిప్ట్ ఎడిటింగ్ లో ఆ క్యారెక్టర్ ను తీసేయడంతో సినిమాలో నటించలేకపోయానని రామ్ చరణ్ తెలిపాడు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ కు వస్తున్న స్పందనతో 'సైరా' యూనిట్ ఫుల్ హ్యాపీగా ఉంది.