బిగ్ బాస్ 2 నెక్స్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరు?
on Jul 4, 2018
ఈసారి ఇంకొంచెం మసాలా అంటూ నాని హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకి వచ్చిన బిగ్ బాస్ 2 ప్రేక్షకులను బాగానే అలరిస్తుంది.. అయితే త్వరలో ఒక వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా నిజంగానే షో కి కొంచెం మసాలా యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు.. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్ లో నవదీప్, దీక్షాపంత్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు.. వీరి ఎంట్రీ షోకి బాగానే ప్లస్ అయింది.. అందుకే ఈ సీజన్ లో కూడా అలాంటి వ్యక్తులను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకురావాలని చూస్తున్నారట.. ఇప్పటికే వరుణ్ సందేశ్, ఛార్మి లాంటి వారిని బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించినట్టు తెలుస్తుంది.. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ వారం లేదా వచ్చే వారంలో వరుణ్ సందేశ్, ఛార్మీలలో ఎవరో ఒకరు బిగ్ బాస్ 2 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. ఇదే నిజమైతే బిగ్ బాస్ ప్రేక్షకులకు పండగే.