శంకర్ కోసమే.. చరణ్ కోసం కాదు!
on Feb 27, 2021
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ ఓ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేయనున్న ఈ పాన్ ఇండియా వెంచర్.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుందని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో కథను కీలక మలుపు తిప్పే ఓ స్పెషల్ రోల్ ఉందట. అందులో కోలీవుడ్ స్టార్ సూర్యని నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారట శంకర్. తనకు పలు కమిట్ మెంట్స్ ఉన్నప్పటికీ.. శంకర్ మీద అభిమానంతో ఈ పాత్ర చేయడానికి సూర్య కూడా ఆసక్తి చూపిస్తున్నారని వినికిడి. త్వరలోనే రామ్ చరణ్ 15లో సూర్య ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, సూర్య నటించిన `సూరరై పోట్రు` (తెలుగులో `ఆకాశం నీ హద్దురా`) ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆస్కార్ బరిలోనూ ఈ సినిమా నిలిచింది. సుధ కొంగర డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సూర్య కి జంటగా అపర్ణ బాలమురళి నటించింది.
Also Read