హరితో సూర్య ఆరో సినిమా.. అప్పుడే!
on Nov 23, 2020
కోలీవుడ్ స్టార్ సూర్య, స్టార్ డైరెక్టర్ హరిది సూపర్ హిట్ కాంబినేషన్. ఆరు, వేల్ (తెలుగులో దేవా), సింగం సిరీస్ (యముడు సిరీస్).. ఇలా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ తమిళనాట ఆదరణ
పొందాయి. తెలుగులోనూ అనువాద రూపంలో అలరించాయి. సింగం సిరీస్ లోని మూడు భాగాల తరువాత ఈ ఇద్దరు మరోమారు జట్టకట్టనున్నారు. అరువా పేరుతో తెరకెక్కనున్న ఈ క్రేజీ వెంచర్ ఈ పాటికే పట్టాలెక్కాల్సింది. అయితే కరోనా కారణంగా ఆలస్యమైంది. దీంతో.. వేరే ప్రాజెక్ట్ లకు సూర్య ముందే కమిట్ అవడంతో హరి కాంబినేషన్ మూవీ మరింత ఆలస్యం కానుంది.
తాజాగా గౌతమ్ మీనన్ షార్ట్ ఫిల్మ్ ని కంప్లీట్ చేసిన సూర్య.. వచ్చే నెల నుంచి పాండిరాజ్ డైరెక్టోరియల్ ని సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నారు. ఇదయ్యాకే హరి ప్రాజెక్ట్ ముందుకు వెళుతుంది. ఆపై వెట్రిమారన్,
బాలా, విక్రమ్ కుమార్ సినిమాలు చేసే దిశగా సూర్య ప్లాన్ చేశారట. మరి.. సూరారై పోట్రు (ఆకాశం నీ హద్దురా)తో బౌన్స్ బ్యాక్ అయిన సూర్య రాబోయే చిత్రాలతో ఆ పరంపరని కొనసాగిస్తారేమో చూడాలి.
ఇదిలా ఉంటే.. సూర్య, హరి కాంబినేషన్ మూవీలో రాశీఖన్నా నాయికగా నటించనుంది.
Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
