ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టండి?
on Sep 13, 2017
వామ్మో... ఆ అందం ఏంటి? ఆ వగలేంటి? ఆ సోయగం ఏంటి? ఎక్కడ్నుంచి వచ్చిందరయ్యా.. నీకీ వయ్యారం? తమిళ నాట ఎవరినోట విన్నా ఇదే మాట. లేడీ గెటప్పులు చాలామంది వేశారు కానీ... విజయ్ సేతుపతి లేడీ గెటప్ ని మాత్రం ‘అదుర్స్’ అనాల్సిందే. తమిళనాట హీరోలు.. లేడీ గెటప్పుల్లో మెరిపించడం కామనే. ‘భామనే సత్యభామనే’ లో కమల్ హాసన్, ‘మల్లన్న’ లో విక్రమ్, ‘రెమో’లో శివకార్తికేయన్.. లేడీ టెటప్పులు వేసి వెండితెర నిండా వయ్యారాన్ని ఒలకబోశారు. వారి దారిలోనే.. ఇప్పుడు విజయ్ సేతుపతి కూడా నడిచాడు. అయితే... వారందిరి కంటే ఆ గెటప్ లో విజయ్ సేతుపతి అందంగా ఉండటం ఇక్కడ విశేషం. నిజానికి విజయ్ సేతుపతి చాలా రఫ్ లుక్ తో ఉంటాడు. అలాంటిది లేడీ గెటప్ వేసే సరికి.. అతని అందం చూసి.. లొకేషన్లో అందరూ షాక్ అయ్యారట. ఇటీవలే ఆ లుక్ ని మీడియాకు లీక్ చేసేశారు. ఇంకేముంది? విజయ్ సేతుపతి స్త్రీ రూపం.. తమిళ నాట చర్చనీయాంశమైంది.
ఇంతకీ విజయ్ సేతుపతి.. లేడీ గెటప్ వేసిన సినిమా ఏంటో చెప్పనేలేదు కదూ. సినిమా పేరు ‘సూపర్ డీలక్స్’. వైరైటీగా ఉంది కదూ. ప్రేమ్ కుమార్ దర్శకుడు. ఇందులో కథ రిత్యా విజయ్ కొన్ని సన్నివేశాల్లో స్త్రీగా కనిపించాలి. అందుకనే ఈ గెటప్. విజయ్ సేతుపతి హీరో అయినప్పట్నుంచీ అతని ప్రయాణమే డిఫరెంట్ గా సాగుతోంది. తాను ఏ పాత్ర చేసినా... అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా... ఈ సినిమా ఒప్పుకున్నా.. కథలో ఏదో ఒక కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు ‘సూపర్ డీలక్స్’ విషయంలో కూడా కొత్తగా వెళ్తున్నాడనడానికి ఈ లుక్ చాలు. ‘సూపర్ డీలక్స్’ అనే టైటిల్ చాలు. ఏమంటారు ఫ్రెండ్స్!