బాహుబలి గతిని మార్చనున్న సుబ్బరాజ్
on Mar 18, 2017
టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్ సుబ్బరాజ్ బాహుబలి మొదటి భాగంలో కనిపించ లేదు. కానీ, ఈ మధ్యే విడుదలైన బాహుబలి రెండవ భాగం ట్రైలర్ విడుదల వేడుకకి వచ్చి అందరికి ప్రశ్నార్ధకంగా మారాడు. సుబ్బరాజ్ ఏంటి బాహుబలి లో లేదు కదా, మరి పార్ట్-2 ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ కి ఎందుకు వచ్చాడు అని.
తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం, సుబ్బరాజ్ బాహుబలి రెండవ భాగంలో అతి ముఖ్యమైన కథ గతిని మార్చే పాత్ర చేసాడు. సాఫీగా సాగే కథ, సుబ్బరాజ్ ఎంటర్ అవగానే కొత్త మలుపులు తిరుగుతుందంట. ఈ పాత్ర సినిమా సాంతం ఉండక పోయిన, కనిపించినంత సేపు ఒక బలమైన ముద్ర వేసి వెళ్ళిపోతుందని అంటున్నారు. మొత్తం గా తెలియక పోయిన, సుబ్బరాజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసాడని సమాచారం.
బాహుబలి లో కనీసం చిన్న పాత్రయినా చేయాలని మహా మహులు అనుకుంటుంటే, లక్కీ గా సుబ్బరాజ్ ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర చేసాడు.