రవితేజ నా ట్రబుల్ షూటర్: శ్రీనువైట్ల
on Nov 12, 2018
దర్శకుడు శ్రీనువైట్లకు విజయం తప్పనిసరి పరిస్థితుల్లో... ‘మిస్టర్’ పరాజయం తరవాత అసలు అతనికి అవకాశం రాదని అనుకుంటున్న సమయంలో... వచ్చిన సినిమా ‘అమర్ అక్బర్ ఆంటోని’. రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో నాలుగో సినిమా ఇది. దీనిపై శ్రీనువైట్ల చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో సెంటిమెంట్ పరంగానూ సినిమా హిట్టవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. శ్రీనువైట్ల మాట్లాడుతూ ‘‘రవితేజ నా ట్రబుల్ షూటర్. నేను ఎప్పుడు అయినా డల్‌గా ఉన్నప్పుడు నాకు ఎనర్జీ ఇస్తాడు. మళ్ళీ నన్ను పైకి తీసుకొస్తాడు. ‘వెంకీ’ సినిమా అప్పుడు ఎనర్జీ ఇచ్చాడు. అలానే చేశాడు. ‘దుబాయ్ శీను’ అప్పుడూ అంతే. ఇప్పుడు ‘అమర్ అక్బర్ ఆంటోని’ సినిమాకీ చేశాడు. రవితేజకు నా మీద నమ్మకానికి నేనెప్పుడూ తనకి రుణపడి వుంటాను. తన ఎనర్జీ ఈ సినిమా. తన మద్దతుతో కొన్ని సవాళ్లు స్వీకరించా. నేను అనుకున్నది, రాసుకున్నది తీయడానికి మైత్రీ నిర్మాతల సహకారం ఎంతో ఉంది’’ అన్నారు. తను ఫ్లాపుల్లో వున్న ప్రతిసారీ రవితేజ హిట్ ఇచ్చాడని, ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా హిట్ అవుతుందని అన్నట్టు శ్రీనువైట్ల మాట్లాడారు.