నితిన్ పెళ్ళిని ప్రకటించిన దిల్ రాజు...!
on Jul 4, 2018
దిల్ రాజు.. మంచి అభిరుచి ఉన్న నిర్మాత.. ఈ విషయాన్ని బొమ్మరిల్లు నుండి శతమానంభవతి వరకు ఎన్నో సినిమాలు రుజువు చేసాయి.. ప్రేక్షకులు హీరో,డైరెక్టర్ సినిమాల కోసమే కాదు ప్రొడ్యూసర్ సినిమాల కోసం ఎదురుచూస్తారు అని ఈ జనరేషన్ కి చూపించిన నిర్మాత బహుశా దిల్ రాజేనేమో.. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో 'శ్రీనివాస కళ్యాణం' అనే సినిమా రూపుదిద్దుకుంటుంది.. నితిన్, రాశీఖన్నా నటిస్తున్న ఈ సినిమాకి 'శతమానంభవతి' ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు.. శతమానంభవతి ఘన విజయం సాధించడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా అవార్డు సాధించింది.. దీంతో శ్రీనివాస కళ్యాణం సినిమా మీద ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పుడు ఈ సినిమా తేదీ ఆ అంచనాలను అమాంతం పెంచేస్తుంది.. దిల్ రాజు మాట్లాడుతూ 'ఒక సాంగ్ కొంత ప్యాచ్ వర్క్ మినహా సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది.. మిగిలిన షూటింగ్ పార్ట్‌ను, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జూలైలో పూర్తి చేసి ఆగస్ట్ 9న 'శ్రీనివాస కళ్యాణం' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము..12 సంవత్సరాల క్రితం ఇదే ఆగస్ట్ 9 రోజున బొమ్మరిల్లు విడుదలైంది.. మళ్ళీ అదే రోజున అదే స్థాయి విజయాన్ని 'శ్రీనివాస కళ్యాణం' తో అందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము" అని చెప్పారు.