బావా కోసం మెగాహీరో...
on May 25, 2020
సుప్రీమ్ హీరో సాయి తేజ్ కొత్త సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'లో 'నో పెళ్లి' సాంగ్ ఈరోజు ఉదయం విడుదలైంది. పెళ్లి వద్దనే యువకులు పాడుకోవడానికి ఈ పాట భలే ఉంటుంది. 'భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ... భర్తగా మారకు బ్యాచిలరు' పాట తర్వాత పెళ్లికి వ్యతిరేకంగా వచ్చిన పాటల్లో ఇదే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మ్యూజికల్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ అందించిన బాణీ ప్రేక్షకులు హమ్ చేసుకునేలానే ఉంది. ప్రస్తుతానికి థియేటర్లు ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియని పరిస్థితుల్లో ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. సినిమాలో విజువల్స్ వాడకుండా సాంగ్ కోసం ప్రత్యేకంగా షూట్ చేశారు.
ఈ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే... మరో ఇద్దరు హీరోలు గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం! మెగా హీరో సాయి తేజ్ కోసం మరో మెగా హీరో వరుణ్ తేజ్ పాటలో కనిపించాడు. వీళ్ళిద్దరూ బావ బావమరిది అనే సంగతి తెలిసిందే. బావ కోసం వరుణ్ తేజ్ అతిధి పాత్రలో మెరిశాడు. మరో విశేషం ఏంటంటే... ఇటీవలే తన ప్రేమ విషయం పబ్లిక్ గా ప్రకటించి, ఈ ఏడాదే పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న రానా దగ్గుబాటి సైతం ఈ పాటలో 'నో పెళ్లి' అంటూ పాడుతూ కనిపించడం. ప్రస్తుతానికి ఈ పాట సినిమాపై క్రేజ్ పెంచింది. కరోనా వార్తలు తప్ప మరో విషయం పట్టించుకోని ప్రజల్లోకి సినిమా వెళ్లేలా చేసింది.
Also Read