సునీతతో ఉన్న వీళ్లిద్దరూ ఎవరో తెలుసా?
on Nov 10, 2017
ఉపద్రష్ట సునీత.. ఈ పేరు చాలామందికి తెలీకపోవచ్చు. కానీ సింగర్ సునీత అంటే మాత్రం ‘ఓహ్... సూపర్.. గాడ్జియస్’ అనంటారు. గాయని గానే కాదు. అందం పరంగా కూడా చాలామంది హృదయాలను కొల్లగొట్టింది సునీత. ఈ అందమైన గాయనిపై చాలా రూమర్లు వచ్చాయ్. వాటన్నింటినీ నేర్పుతో తిప్పికొట్టిన ఘనత సునీతది. ‘నాపై ఎన్ని గాలివార్తలు వచ్చినా నేను కేర్ చేయను. ఎందుకంటే.. అబద్ధాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోను. పాట, ఫ్యామిలీ.. ఇదే నా సర్వస్వం’.అంటూ ఓ ఫొటో పెట్టింది సునీత. తన పిల్లలు ఆకాష్, శ్రేయలతో తాను దిగిన ఈ ఫొటో ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 19 ఏళ్లకే వివాహం చేసుకున్న సునీత.. చిన్నవయసులోనే తల్లి అయ్యింది. ఇప్పుడు ఆ పిల్లలిద్దరూ యుక్త వయసుకొచ్చారు. సునీతను చూస్తే.. ఇప్పటికీ పెళ్ల ికాని అమ్మయి లాగే ఉంటుంది. కానీ.. ఆమెకు ఇంత పెద్ద పిల్లలు ఉండేసరికి.. ఈ ఫొటోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పెద్దవాళ్లైపోయిన పిల్లలతో సునీత కొత్తగా కనిపిస్తున్నారు ఈ ఫోటో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.