నాగ్‌పై సూర్యదే పై చేయి
on Feb 11, 2017
ఈరోజుల్లో `హిట్` అనే టాక్ తెచ్చుకోవడం అంటే మాటలు కాదు. అందుకోసమే చిత్రబృందం అంతా తాపత్రయపడుతుంటుంది. కనీసం యావరేజ్ సినిమా అని చెప్పుకొన్నా, మంచి వసూళ్లు వస్తాయి. హిట్టయిపోతే వసూళ్లు కొల్లకొట్టేయొచ్చు. అందులోనూ అగ్ర హీరో సినిమా అంటే.. రికార్డుల మోతే. అయితే.. శుక్రవారం విడుదలైన ఓం నమో వేంకటేశాయ పరిస్థితి రివర్స్ అయ్యింది. తొలిరోజే ఈ సినిమాకి మంచి టాక్ వచ్చేసింది. అన్నమయ్య అంత స్థాయిలో కాకపోయినా... రాఘవేంద్రరావు బాగానే తీశారని, నాగార్జున అద్భుతంగా నటించారని కితాబులు ఇచ్చేస్తున్నారు.
అయితే వసూళ్లు చూస్తే మాత్రం బావురుమనాల్సిందే. కొన్ని థియేటర్లలో కనీసం 60 శాతం ఆక్యుపెన్సీ కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. హౌస్ ఫుల్ అయిన థియేటర్లు చాలా తక్కువ. ఏ, బీ, సీ.... ఇలా ఏ సెంటర్ చూసుకొన్నా ఇదే పరిస్థితి. యువతరం ఎగబడి చూసే సినిమా కాదిది. ఫ్యాన్స్‌ని ఎక్ట్రాక్ట్ చేసే అంశాలూ ఉండవు. ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ కుటుంబ ప్రేక్షకులే. వాళ్లంతా తొలి రోజే థియేటర్లకు వచ్చేయరు. అందుకే... తొలిరోజు థియేటర్లలో జనం పలుచగా కనిపించారు. అయితే ఇదే సమయంలో... సూర్య సినిమా సింగం 3కి మాత్రం వసూళ్లు భారీగా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా బీ,సీ సెంటర్లలో సింగం 3దే హవా. మరి నాగ్ సినిమా ఎప్పుడు పుంజుకుంటుందో చూడాలిక.