ప్రముఖ హీరోయిన్ హై లెవెల్ చీటింగ్
on Mar 11, 2018
తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళ సినిమాల్లో నటించిన ప్రముఖ హీరోయిన్ సింధు మీనన్ పై చీటింగ్ కేసు నమోదయింది. బెంగుళూరులోని బ్యాంకు ఆఫ్ బరోడా లో నకిలీ డాక్యుమెంట్లతో రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా తమ సంస్థను మోసం చేసిందంటూ బ్యాంకు అధికారులు సింధు మీనన్ పై, ఆమె ముగ్గురు సోదరులపై బెంగళూరులోని ఆర్ఎంసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ప్రస్తుతం, సింధు మీనన్ విదేశాల్లో ఉండటంతో.. ఆమె సోదరుడు కార్తికేయన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జ్యుబిలెంట్ మోటార్స్ వక్ఫ్ ప్రై.లి. సంస్థ పేరుతో ఆర్ఎంసీ యార్డ్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ నుంచి 36 లక్షలు రుణం తీసుకున్న సింధు మీనన్ తిరిగి చెల్లించకపోవడంతో, ఆమె సమర్పించిన పత్రాలు పరిశీలించగా అవి నకిలీవని తేలడంతో బ్యాంకు అధికారులు పోలీసులని ఆశ్రయించారు. సింధు మీనన్ సోదరుడు ఈ నకిలీ పత్రాలని నాగశ్రీ శివన్న, సుధా రాజశేఖర్ అనే మహిళల సాయంతో సృష్టించినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ హీరోయిన్ ఇంత పెద్ద చీటింగ్ చేయడం నిజంగా ఆశ్చర్యానికి గురిచేసే అంశం!