నాని నోట బెంగాలీ మాటలు
on Feb 25, 2021
నేచురల్ స్టార్ నాని చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి. ఆ సినిమాలే.. `టక్ జగదీష్`, `శ్యామ్ సింగ రాయ్`, `అంటే.. సుందరానికీ!`. వీటిలో `టక్ జగదీష్` విడుదలకు సిద్ధమవుతుండగా.. `శ్యామ్ సింగ రాయ్` చిత్రీకరణ దశలో ఉంది. `అంటే.. సుందరానికీ!` మే నుంచి సెట్స్ పైకి వెళ్ళనుంది.
ఇదిలా ఉంటే.. నాని బర్త్ డే సందర్భంగా బుధవారం `శ్యామ్ సింగ రాయ్` ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసింది యూనిట్. ఇందులో బెంగాలీ బాబు లుక్ లో నాని ఇట్టే ఆకట్టుకున్నారు. కాగా, ఈ సినిమాలో కథానుసారం నాని కొన్ని బెంగాలీ మాటలు కూడా పలుకుతారట. ఇందుకోసం.. నాని బెంగాలీ భాషపై ప్రత్యేక దృష్టి సారించారని టాక్. అంతేకాదు.. నాని చెప్పే ఈ డైలాగ్స్ కి థియేటర్స్ లో ప్రేక్షకులు ఫిదా అవ్వడం ఖాయమంటున్నారు.
కాగా, `శ్యామ్ సింగ రాయ్`ని `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్యన్ డైరెక్ట్ చేస్తుండగా.. నానికి జోడీగా సాయిపల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టెయిన్ నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి బాణీలు అందిస్తున్నారు.