శృతికి ఆపరేషన్... కానీ మాట ముఖ్యం !
on Apr 18, 2014
అల్లు అర్జున్, శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం "రేసుగుర్రం". ఇందులో "సినిమా చూపిస్త మావా.." అనే పాటలో వీళ్ళిద్దరూ డాన్సులతో చింపేసారు. బన్నీకి ధీటుగా శృతి కూడా డాన్సులు చేసింది. అయితే ఈ పాటలో ఒక బీజియంలో బన్నీపై శృతి కూర్చొని డాన్స్ చేసే స్టెప్ ఉంటుంది. ఈ స్టెప్ గురించి శృతిని అడిగితే... నేను కంఫర్ట్ గానే కూర్చున్నాను కానీ, పాపం బన్నీనే నన్ను మోయాల్సి వచ్చింది. ఆ క్రెడిట్ అంతా బన్నీ, దర్శకులు సురేందర్ రెడ్డిదే అని చెప్పుకొచ్చింది. అలాగే తను ఇటీవలే కడుపునొప్పితో హాస్పిటల్ లో చేరి, ఆపరేషన్ అయినప్పటికీ కూడా హిందీ "గబ్బర్" షూటింగ్ కి డేట్స్ ఇవ్వడంతో.. ఇచ్చిన మాట కోసం వెంటనే షూటింగ్ లో పాల్గొన్నాను అని తెలిపింది. మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకుంటాను అని చెపుతుంది. తండ్రి నటవారసత్వాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, తన వృత్తి పట్ల శ్రద్ధ, క్రమశిక్షణ, పట్టుదల బాగానే అలవాటు చేసుకుంది. నిజంగా ఈ విషయంలో అందరూ హీరోయిన్ల కంటే శృతి బెటర్ అని చెప్పుకోవచ్చు. హ్యాట్సాఫ్ శృతి.