ప్రభాస్తో శ్రుతి హాసన్?
on Jan 25, 2021
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ మహారాజా రవితేజ.. ఇలా ఈ ఈతరం అగ్ర కథానాయకులందరితోనూ ఆడిపాడింది చెన్నై పొన్ను శ్రుతి హాసన్. వీరిలో తారక్ తో తప్ప మిగిలిన వారందరి కాంబినేషన్స్ లోనూ ఘనవిజయాలు చూసింది. ఇంతమందితో జట్టుకట్టినా.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మాత్రం ఈ అమ్మడు ఇప్పటివరకు జోడీ కట్టలేదు. శ్రుతి కెరీర్ ఆరంభంలో ఒకట్రెండు సందర్భాల్లో ఈ వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని కథనాలు వచ్చినా.. అవి వార్తలకే పరిమితమయ్యాయి. త్వరలోనే ఆ ముచ్చట కూడా తీరే అవకాశముందంటున్నారు.
ఆ వివరాల్లోకి వెళితే.. కేజీఎఫ్ కెప్టెన్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో సలార్ పేరుతో ప్రభాస్ ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్ పాత్ర కోసం పలువురు బాలీవుడ్ భామల పేర్లు వినిపించాయి. ఆఖరికి కొత్తమ్మాయిని తీసుకోబోతున్నారనే టాక్ కూడా వినిపించింది. అయితే ఆ అవకాశం శ్రుతికే దక్కిందని సమాచారం. ఇంతవరకు తను కనిపించని పాత్రలో మిస్ హాసన్ దర్శనమివ్వబోతోందట. తను ప్రస్తుతం చేస్తున్న ఓ ప్రాజెక్ట్ తో డేట్స్ క్లాష్ కావడమొక్కటే.. శ్రుతి ముందున్న సమస్య. అది తీరితే.. సలార్ లో ప్రభాస్, శ్రుతి జోడీ పక్కానే. చూద్దాం.. ఏం జరుగుతుందో?