పోలీస్‌గా నాని హీరోయిన్
on May 15, 2019
శ్రద్ధా శ్రీనాథ్ పోలీస్‌గా నటిస్తున్నది. ఎవరీ అమ్మాయి అనుకుంటున్నారా? 'జెర్సీ'లో నాని పక్కన నటించిన హీరోయిన్. తెలుగులో ఆమెకు 'జెర్సీ' తొలి సినిమా. అంతకు ముందు కన్నడలో, తమిళంలో సినిమాలు చేసింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యు టర్న్' ఒరిజినల్ వెర్షన్, కన్నడ 'యు టర్న్'లో ఆమె హీరోయిన్. ఆమె నటనకు చాలామంది అభిమానులున్నారు. ఇప్పుడీ హీరోయిన్ పోలీస్‌గా నటిస్తున్నది తెలుగు సినిమాలో కాదు, ఓ తమిళ సినిమాలో! అదెలాగో తెలుగులోకి డబ్ అవుతుంది. ఎందుకంటే... అందులో విశాల్ హీరో. కొత్త దర్శకుడు ఆనంద్‌తో విశాల్ చేస్తున్న సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారు. ఇందులో విశాల్ మిలిటరీ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
Also Read