హాట్ ఇమేజ్ కోసం శ్రద్ధా శ్రీనాథ్ ఆరాటమా?
on Jul 11, 2020
అందం కంటే అభినయం పరంగా శ్రద్ధా శ్రీనాథ్ ఎక్కువ పేరు తెచ్చుకున్నారు. 'జెర్సీ'లో నాని కి భార్య పాత్రలో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతకుముందే కొంతమంది కన్నడ సినిమా 'యూటర్న్' చూసి... శ్రద్ధా శ్రీనాథ్ నటన గురించి గొప్పగా చెప్పారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళ సినిమాలు కూడా చేస్తోంది ఆమె. తమిళ్ హిట్ 'విక్రమ్ వేద'లో మాధవన్ భార్య పాత్రలో నటించింది. శ్రద్ధా శ్రీనాథ్ కి హోమ్లీ ఇమేజ్ వచ్చింది. అయితే... హాట్ ఇమేజ్ కోసం ఆమె ఆరాటపడుతోంది అని టాక్.
ఇటీవల ఓటీటీలో విడుదలైన 'కృష్ణ అండ్ హిజ్ లీల'లో శ్రద్ధా శ్రీనాథ్ బోల్డ్ క్యారెక్టర్ చేసింది. ఎక్స్ పోజింగ్ చేయలేదు గానీ... దమ్ము కొడుతూ, మందు తాగే పాత్రలో నటించింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో పై అందాలను చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసింది. హోమ్లీ ఇమేజ్, వైఫ్ క్యారెక్టర్స్ ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి ఉపయోగపడవని ఆమెకు అర్థం అయిందట. ఇటీవల 'పెళ్ళయిన హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా?' అని ఆమె సోషల్ మీడియాలో ప్రశ్నించారు. తర్వాత తర్వాత హాట్ ఇమేజ్ కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశారు. యంగ్ హీరోల పక్కన లవ్ స్టోరీస్ చేయడానికి హోమ్లీ ఇమేజ్ కంటే హాట్ ఇమేజ్ బెటర్ అని భావిస్తున్నారు ఏమో? సడన్ గా హాట్ ఫోటోలు పోస్ట్ చేయడానికి కారణం ఏమై ఉంటుందని డిస్కషన్స్ స్టార్ట్ అయింది.
Also Read