కేజియఫ్ సీక్వెల్ దానికి ఈక్వెల్‌గా ఉంటుందా!!!
on Mar 13, 2019
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన చిత్రం ` కెజియఫ్- చాప్టర్ 1` చిత్రం ఎంతటి గ్రాండ్ సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా తన సత్తాను నిరూపించుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ చిత్రం భారీ బడ్జెట్ తో రూపొంది వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజై దాదాపు 250 కోట్లు కలెక్షన్స్ సాధించి రికార్డ్ సృష్టించి కన్నడ చిత్ర పరిశ్రమకు మంచి పేరు తీసుకొచ్చింది. తెలుగులో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేసారు. ఇదిలా ఉంటే ...ఇప్పుడు కేజియఫ్ మొదటి భాగానికి వచ్చిన క్రేజ్ తో దానికి సీక్వెల్ గా `కేజియఫ్-2 ` సినిమా ఈ రోజు బెంగుళూరులో కంఠీరవ స్టూడియోస్ లో ఘనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ కల్లా గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ చేసి నెక్ట్స్ ఇయర్ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ`` కేజియఫ్ చాప్టర్ వన్ చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు చాప్టర్ 2 చిత్రం డబుల్ త్రిబుల్ ట్రీట్ ఇస్తుందని ``చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కిరంగదూర్, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాల్గొన్నారు. అయితే సీక్వెల్ గా వచ్చే చాప్టర్ 2 , చాప్టర్ 1 ఈక్వెల్ గా ఉంటుందా? మరి ఆంచనాలను అందుకుంటుందా? లేదా అన్నది తెలియాలంటే నెక్ట్స్ ఇయర్ వరకు ఆగాల్సిందే.