రమ్యకృష్ణ అల్లుడు ఎంట్రీ ఇచ్చాడు..!!
on Jul 9, 2018
ఒకప్పుడు అగ్ర హీరోల సరసన హీరోయిన్ గా నటించి అలరించిన రమ్యకృష్ణ, బాహుబలిలో శివగామి పాత్రతో మెప్పించి ఈ తరం ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.. దీంతో రమ్యకృష్ణ చేసే సినిమాల మీద, పాత్రల మీద ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది.. ప్రస్తుతం రమ్యకృష్ణ, మారుతీ దర్శకత్వంలో వస్తున్న 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాలో నటిస్తున్నారు.. నాగ చైతన్య, అను ఇమ్మానియేల్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రమ్యకృష్ణ, నాగచైతన్య అత్తగా కనిపించబోతున్నారు.. ఏ మాయ చేసావె, 100 % లవ్ లాంటి లవ్ స్టోరీస్ తో యువతకు దగ్గరైన నాగచైతన్య.. ఈ సినిమాలో అత్తని ఆటపట్టించే అల్లుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది.. ఈ ఫస్ట్ లుక్ కి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది.. చూద్దాం మరి రమ్యకృష్ణ, నాగచైతన్యలు అత్తా అల్లుళ్ళగా తెరమీద ఎలా అలరిస్తారో.