దక్షిణాదిలో సూర్య... ఉత్తరాదిలో షారుఖ్!
on Mar 12, 2019
పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవితకథ ఆధారంగా తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో తమిళ కథానాయకుడు మాధవన్ 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్' బయోపిక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. మాధవన్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే... ఈ సినిమాలో సూర్య, షారుఖ్ ఖాన్ అతిథి పాత్రలు చేస్తున్నారు. ఇద్దరూ చేస్తున్నది ఒక్కటే పాత్ర. సూర్య తమిళ్ వెర్షన్ లో కనిపిస్తే... షారుఖ్ హిందీ, ఇంగ్లిష్ వెర్షన్స్ లో కనిపిస్తారు. తమిళ 'రాకెట్రీ - ది నంబి ఎఫెక్ట్'ను దక్షిణాది భాషలు తెలుగు, మలయాళంలో అనువదించి విడుదల చేయాలని మాధవన్ భావిస్తున్నారు. తెలుగులో ఆయనకు మంచి మార్కెట్ ఉన్న సంగతి తెలిసిందే. గతేడాది 'సవ్యసాచి'లో విలన్ పాత్రలోనూ నటించారు.