మహానటిని మద్యానికి బానిస చేసింది జెమినీ గణేశన్ కాదా?..
on Jun 4, 2018
మహానటి.. ఏ ముహూర్తాన ఈ సినిమా తీయాలన్న ఆలోచన వచ్చిందో కానీ.. ఈ సినిమా వల్ల ఇప్పటితరం వాళ్ళక్కూడా సావిత్రి గురించి తెలిసింది.. సినిమా చూసిన ప్రతివారికి సావిత్రి మీద గౌరవం, ప్రేమ రెట్టింపయ్యాయి.. అలానే జెమినీ గణేశన్ మీద కోపం పెరిగింది.. అయితే సినిమాలో చూపించినట్టు జెమినీ విలన్ కాదంటూ.. కొందరు సినిమాలో తప్పులు ఎత్తిచూపుతున్నారు.. సీనియర్ నటి రమాప్రభ కూడా దీని గురించి స్పందించారు.. సినిమాలో చూపినట్టు సావిత్రికి మద్యం అలవాటు చేసింది జెమినీ కాదన్నారు.. అంతేనా జెమినీ చాలా మంచివాడు.. సినిమా తీసేముందు నన్ను సంప్రదిస్తే నిజాలు తెలిసేవి అన్నారు.. రమాప్రభ అన్నట్టు నిజంగానే సినిమాలో చరిత్రని వక్రీకరించారా అని ప్రేక్షకుల్లో కొత్త అనుమానం మొదలైంది.. చరిత్ర ఏం చెప్పినా.. మహానటిగా సావిత్రి సృష్టించిన చరిత్రని ఈ తెలుగునేల ఎప్పటికీ మర్చిపోదు...