English | Telugu

క‌మెడియ‌న్‌లా ఉంటుంది కానీ... హీరోనే! - స‌ప్త‌గిరి

on Jun 11, 2019

'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో కమెడియన్ సప్తగిరి హీరోగా మారాడు. తరవాత 'సప్తగిరి ఎల్ఎల్‌బి' చేశాడు. ఈ నెల 14ల 'వజ్రకవచధర గోవింద'తో ముచ్చటగా మూడోసారి హీరోగా థియేటర్లలోకి వస్తున్నాడు. ఈ సినిమా విడుదల సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ "హీరోగా నా తొలి సినిమాకు పేరు, డబ్బులు వచ్చాయి. రెండో సినిమాకు పేరు మాత్రమే వచ్చింది. ఈ సినిమాకు పేరూ, డబ్బులూ రావాలని కోరుకుంటున్నాను. నేను ఇండస్ట్రీకి సహాయ దర్శకుడిగా వచ్చారు. ఏడేళ్లు వివిధ సినిమాలకు సహాయ దర్శకుడిగా పని చేశా. ఎప్పుడూ కమెడియన్ కావాలనుకోలేదు. కమెడియన్ అయ్యాను. తరవాత హీరో అయ్యాను. హీరోగా నటించిన రెండు సినిమాల్లో ఫైట్స్, డ్యాన్స్ చేశా. ఈ సినిమాలో ఆ రెండూ పక్కన పెట్టి చేశా. గోవిందు అనే దొంగ క్యారెక్టర్ చేశా. మన  లక్ష్యం గొప్పది అయినప్పుడు మనం ప్రయాణించే మార్గం గొప్పది అయ్యి ఉండాలని, లేకపోతే దేవుడు శిక్షిస్తాడని సందేశంతో సాగుతుంది. క్యాన్సర్ పేషెంట్ల సమస్య గురించి సినిమాలో చర్చించాం. నా క్యారెక్టర్ చూడటానికి క‌మెడియ‌న్‌లా ఉంటుంది కానీ... సినిమాలో నేను హీరోనే. హీరోగా చేస్తున్నానని కమెడియన్ క్యారెక్టర్లకు దూరం కాను. నేను చేస్తానని చెబుతున్నాను. కానీ, ఎవరూ అవకాశం ఇవ్వడం లేదు. దర్శకులు మారుతి, గాంధీతో కమెడియన్ క్యారెక్టర్లు ఇవ్వమని అడిగాను. ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కమెడియన్ గా నటిస్తున్నాను. అలాగే, 'దెయ్యం పట్టింది' అని కాన్సెప్ట్ మీద ప్రేమకథాచిత్రమ్ తరహాలో స్క్రిప్ట్ రెడీగా ఉంది. బడ్జెట్ కుదిరితే నెక్స్ట్ ఆ సినిమా ఉంటుంది" అని అన్నారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here