షాకింగ్: సంజయ్ దత్‌కి లంగ్ క్యాన్సర్!
on Aug 12, 2020
బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మరో షాక్. స్టార్ హీరో సంజయ్ దత్ లంగ్ క్యాన్సర్ బారిన పడ్డారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఆయనకు మూడవ దశలో ఉన్నట్లు తేలిందని ముంబై సమాచారం. అతి త్వరలో చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లనున్నారని తెలిసింది.
గతవారం శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని లీలావతి ఆసుపత్రికి సంజయ్ దత్ వెళ్లారు. ఆయనకు కరోనా వచ్చిందా? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి. తనకు కరోనా లేదని సంజయ్ దత్ స్వయంగా ప్రకటించారు. ఒకరోజు తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దాంతో ఆయన అభిమానులు, హిందీ చలనచిత్ర ప్రముఖులు ఊపిరి తీసుకున్నారు. మంగళవారం మరోసారి ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా లంగ్ క్యాన్సర్ అని నిర్ధారణ అయినట్లు సమాచారం.
లంగ్ క్యాన్సర్ విషయాన్ని సంజయ్ దత్ చెప్పలేదు. కానీ, ట్రీట్మెంట్ కోసం కొన్ని రోజులు సినిమాలు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు, స్నేహితులు అభిమానులను కోరారు. తన ఆరోగ్య పరిస్థితిపై వదంతులు ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
Also Read