సానియామీర్జా బయోపిక్ లో బాలీవుడ్ భామ..!!
on Aug 4, 2018
బాలీవుడ్ లో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తుంది.. ప్రేక్షకులు కూడా బయోపిక్ ల మీద విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు.. బాగ్ మిల్కా బాగ్, ఎమ్ ఎస్ ధోని, సంజూ ఇలా ఎన్నో బయోపిక్ లు ప్రేక్షకులను అలరించాయి.. తాజాగా బాలీవుడ్ లో మరో బయోపిక్ టాపిక్ తెరమీదకు వచ్చింది.. టెన్నిస్ స్టార్ సానియామీర్జా జీవితం ఆధారంగా త్వరలో ఓ బయోపిక్ తెరకెక్కనుంది.. ఇప్పటికే నిర్మాత రోనీ స్క్రూవాలా ఈ బయోపిక్ తెరకెక్కించేందుకు హక్కులు తీసుకున్నారు.. అయితే సానియామీర్జా పాత్రలో బాలీవుడ్ నటి పరిణితి చోప్రా నటించబోతున్నట్టు తెలుస్తోంది.. గతంలో బాలీవుడ్ లో, క్రీడాకారుల జీవితం ఆధారంగా తెరకెక్కిన పలు బయోపిక్ లు విజయం సాధించాయి.. వాటి సరసన సానియామీర్జా బయోపిక్ కూడా చేరుతుందేమో చూడాలి.