కత్తి స్వారీ నేర్చుకున్న తర్వాత శ్రుతిని వద్దు పొమ్మన్నారు!
on May 30, 2017
బాహుబలి తర్వాత అందరి ఫోకస్ సోషియో ఫాంటసీ సినిమాల మీదకి మళ్లింది. బాహుబలి 2 విడుదలవకముందే యాక్ట్రెస్ ఖుష్బూ భర్త సుందర్ సి సంఘమిత్ర అనే భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేసారు. స్టార్ హీరోలెవరు ఆ సినిమా చేసే ధైర్యం చేయకపోవడంతో జయం రవి, ఆర్య లాంటి మార్కెట్ ఎప్పుడుంటుందో... పోతుందో తెలియని హీరోల్ని లీడ్ రోల్స్ కి తీసుకున్నారు. అయితే, ప్రధాన పాత్ర సంఘమిత్ర చేసే అదృష్టం శృతి హాసన్ కి వరించింది. ఈ సినిమా కోసం కత్తి స్వాము, గుర్రం స్వారీ లాంటి విద్యలు నేర్చుకుంది. దర్శక, నిర్మాతలు మొన్నా మధ్య కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో శృతి హాసన్ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు.
స్పందన ఎలా వచ్చింది అనే విషయం పక్కన పెడితే, నిర్మాతలు బడ్జెట్ లో కొరతలు విధించారు అని వార్తలు వచ్చాయి. ఇంతలో, మేకర్స్ శృతి హాసన్ ని తప్పిస్తున్నటు ప్రకటించి పెద్ద దుమారం లేపారు. వాస్తవానికి, హీరో కానీ హీరోయిన్ కానీ ఏ కారణాల వల్ల అయినా సినిమా నుండి తప్పుకుంటే మొదట వాళ్లే అఫిషియల్ గ అనౌన్స్ చేస్తారు... ఇది ఆనవాయితీ... కానీ, ఇందుకు విరుద్దంగా, నిర్మాతలే ఈ వార్తని అధికారికంగా ప్రకటించారు. దర్శక, నిర్మాతలతో చిన్న విషయమై గొడవపెట్టుకొని... అది చిలికి చిలికి గాలి వానగా మరి... సినిమా లోంచి బయటకొచ్చే పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. ఏది ఏమయినా, ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ లోంచి బయటకెళ్ళడం శృతి కి పెద్ద దెబ్బే!
Also Read