పెళ్లి తరవాత పేరు కూడా మార్చుకున్న హీరోయిన్
on Nov 23, 2020
నందమూరి కల్యాణ్ రామ్ సరసన 'కత్తి'లోనూ, మంచు మనోజ్ సరసన 'మిస్టర్ నూకయ్య'లోనూ కథానాయికగా నటించిన సనా ఖాన్ పెళ్లి చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ సిటీకి చెందిన అనాస్ సయ్యద్ తో వివాహమైనట్టు సనా ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వెల్లడించారు. పూర్తిగా ముస్లిం సంప్రదాయం ప్రకారం నిఖా జరిగింది.
అక్టోబర్ నెలలో రంగుల ప్రపంచాన్ని వదిలేసి మానవాళికి సేవ చేయాలని నిర్ణయించుకున్నట్టు సనా ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరణం తరవాత మెరుగైన జీవితం కోసమే భూమ్మీద ఈ జీవితమని అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఆధ్యాత్మిక మార్గం వైపు వెళ్లిన రెండు నెలల్లో ఆమె పెళ్లి చేసుకోవడం గమనార్హం.
పెళ్లి తరవాత సనా ఖాన్ తన పేరు కూడా మార్చుకున్నారు. సయ్యద్ సనా ఖాన్ అని సోషల్ మీడియా ఖాతాల్లో పేరు మార్చారు. ఆమె సోషల్ మీడియా చూస్తే పూర్తిగా సాంప్రదాయ దుస్తుల్లో దర్శనం ఇస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
