బుల్లి సమంత దొరికేసింది!
on Feb 6, 2019
'హలో' సినిమాలో అఖిల్ సరసన నటించిన హీరోయిన్ కల్యాణీ ప్రియదర్శన్ ఎవరు? ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కుమార్తె. హిందీ హీరో వరుణ్ ధావన్ ఎవరు? దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు. అంతెందుకు.. తెలుగులో దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి హీరోగా నటిస్తున్నాడు. కుమార్తె పవిత్ర బాలనటిగా కొన్ని సినిమాల్లో నటించింది. వీళ్ళ బాటలో నడుస్తూ... ప్రముఖ రచయిత, దర్శకుడు బివిఎస్ రవి కుమార్తె నటనలోకి అడుగుపెట్టింది.సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 'ఓ బేబీ'. 'ఎంత సక్కగున్నావే' అనేది ఉపశీర్షిక. కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాకు నందినిరెడ్డి దర్శకురాలు. ఇందులో బివిఎస్ రవి కుమార్తె అనగ స్వర నటిస్తోంది. అదీ సమంత చైల్డ్ హుడ్ క్యారెక్టర్ లో. అంటే... సినిమాలో సమంత చిన్నప్పటి పాత్రలో, బుల్లి సమంతగా అనగ స్వర కనిపిస్తుందన్నమాట.