పెళ్లైనా నాలో ఏ మార్పు లేదు... విశాల్ సూపర్బ్!
on Dec 29, 2017
విశాల్ సూపర్ అట. తన ఎనర్జీ లెవల్స్ చూసి షాకయ్యిందట. స్వయంగా సమంతానే ఈ విషయం చెప్పింది. పైగా పెళ్లయినా... నన్ను ఏం కొత్తగా చూడలేదనీ.. నాలో కూడా పెళ్లికి సంబంధించిన ఏ మార్పు రాలేదని సమంత చెబుతోంది. ఏంటి? షాక్ అవుతున్నారా? తప్పుగా అర్థం చేసుకోకండి. విషయం ఏంటంటే... విశాల్ కు జోడీగా సమంత నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇరుంబుతిరై’. ఈ సంక్రాతికి సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులంతా కలిసి సరదాగా ఓ గెట్ టుగేదర్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సమంతతో కేక్ కట్ చేయించారు. సమంత మాట్లాడుతూ ’ నా పెళ్లైన మూడో రోజే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాను. సాధారణంగా పెళ్లైన అమ్మాయితో అందరూ చాలా జాగ్రత్తగా బిహేవ్ చేస్తారు.
కానీ... నా దగ్గర అందరూ ఇదివరకు లాగే సరదాగా ఉన్నారు. నన్ను కొత్తగా ఏం చూడలేదు. నాకు చాలా ఆనందం కలిగించిన అంశం ఇది. ఈ సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం నాకు పెద్ద విజయాన్నిస్తుందని ఆశిస్తున్నాను. ఇందులో విశాల్ పెర్ ఫార్మెన్స్ సూపర్. కొన్ని సన్నివేశాల్లో తన ఎనర్జీలెవల్స్ చూసి షాక్ అయ్యాను. మళ్లీ తనతో నటించాలని ఉంది’ అని చెప్పుకొచ్చారు. అదనమాట అసలు విషయం.