English | Telugu

మరిదికి వదిన స్వీట్ షాక్!

on Nov 14, 2017

కొన్ని వార్తలు వినడానికి బావుంటాయ్. నిజంగా అలా జరిగితే ఎంత బావుడ్నో అనిపిస్తుంది. అలాంటి గాసిప్పే ఒకటి ఫిలిం సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకెళ్తే.. అఖిల్ ప్రస్తుతం ‘హలో’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై అంచనాలు ఓ స్థాయిలో ఉన్నాయ్. కారణం... దీనికి దర్శకుడు విక్రమ్ కుమార్ అవ్వడమే. అక్కినేని కుటుంబానికి మెమరబుల్ హిట్ ఇచ్చిన విక్రమ్ కుమార్... అఖిల్ కు కూడా గ్రాండ్ సక్సెస్ ఇస్తాడని అందరూ నమ్ముతున్నారు. కారణం.. విక్రమ్ కుమార్ కి ఇప్పటివరకూ ఒక్క పరాజయం కూడా తెలీదు. పైగా.. ఫ్లాపులతో మగ్గిపోతున్న నితిన్ ని ‘ఇష్క్’తో హిట్ ట్రాక్ కి ఎక్కించింది కూడా విక్రమ్ కుమారే. అందుకే.. ‘హలో’పై అందరూ నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా విషయంలోనే ఓ ఆసక్తికరమైన న్యూస్ వినబడుతోంది.

అదేంటంటే... ‘మనం’ మాదిరిగానే..ఇందులో కూడా అక్కినేని కుటుంబం మొత్తం కనిపించనుందట. నాగ్,అమల, చైతూ ఈ సినిమాలో కూడా దర్శనమిస్తారట. కొసమెరుపేంటంటే.. రీసెంట్ గా అక్కినేని ఫ్యామిలీ నంబర్ అయిన.. కథానాయిక సమంత కూడా ఇందులో ఓ మంచి పాత్ర చేస్తోందట. ఆల్రెడీ.. ‘మనం’లో వీరిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు వదిన, మరిదులుగా షేర్ చేసుకోబోతున్నారన్నమాట. అక్కినేని అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూసే. ఇది నిజమైతే ఎంత బావుడ్నో కదా. . 

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here