సమంతతో అంత వీజీ కాదు!
on Sep 7, 2018
‘సీతతో వీజీ కాదు... సీతతో వీజీ కాదు’ – ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో సాయిధరమ్‌తేజ్ పాడిన పాట గుర్తుందా? సీత బదులు సమంత అని మార్చి కొంతమంది సినీ విలేకరులు ఇంచుమించు ఇదే పాట పాడుకోవలసిన పరిస్థితి! ‘సమంతతో వీజీ కాదు... అంత వీజీ కాదు’ అని! ఎందుకంటే... ఇంటర్వ్యూల కోసం ఆమె దగ్గరకు వెళ్తోన్న మీడియాకు సమంత చుక్కలు చూపిస్తున్నారని టాక్. ఈ అక్కినేని కోడలు ప్రధాన పాత్రలో నటించిన ‘యూ టర్న్’ ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకొస్తుంది. సినిమాలో హీరో ఎవరూ లేరు. లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో ప్రచార బాధ్యతలు సమంత మీద పడ్డాయి. అటు టీవీ ఛానళ్లకు... ఇటు పత్రికల వారికి... మధ్యలో వెబ్ మీడియాకు... అందరికీ సమంతే ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ముందుకొస్తుంది. అయితే... ఈ అమ్మడు కొన్ని కండీషన్స్ పెడుతోంది. అవేంటంటే...
1) మ్యారీడ్ లైఫ్ గురించి, ఎప్పుడు తల్లి అవుతారు? అనే విషయాలు అడగకూడదు.
2) ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్? గురించి ప్రశ్నించకూడదు.
3) గతంలో ఆమెకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు ప్రస్తావించకూడదు.
4) లిప్ లాక్స్, ఎక్స్పోజింగ్ వంటి అంశాలపై డిస్కషన్ చేయకూడదు.
వగైరా వగైరా వగైరా...
ఈ విధంగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందు సమంత చిన్నసైజు చిట్టా ఒకటి బయటపెడుతోంది. పొరబాటున ఎవరైనా అడిగారో.... అంతే సంగతులు! శివాలెత్తుతోందని ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులు వాపోయారట!
అక్కినేని నాగచైతన్యతో సమంతకు పెళ్లై అక్టోబర్ 7కి ఏడాది అవుతోంది. ఈ సందర్భంగా పెళ్లి జీవితం ఎలా వుందో తెలుసుకోవాలని చాలా మంది అనుకుంటున్నారు. అలాగే, సంసారంలో చిన్న చిన్న అలకలు ఏవైనా ఉన్నాయా? అనే ప్రశ్న సహజం. కానీ, సమంత సినిమా గురించి తప్ప మరో అంశం గురించి మాట్లాడనని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడంతో ‘సమంతతో అంత వీజీ కాదు’ అనుకుంటున్నారంతా!!